Tuesday, 28 July 2026 08:05:44 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో నివసించే యువత అన్ని రంగాల్లో ముందుండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 23 May 2025 04:57 PM Views : 826

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం మే 23 (తెలుగు వెలుగు ) : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని గిరిజన ప్రాంతాలు మరియు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు,మైదాన ప్రాంతాల్లోని వలస గిరిజన యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.ఇందులో భాగంగానే ఈ రోజు దమ్మపేట పోలీసుల ఆధ్వర్యంలో దమ్మపేట మండలంలోని కొండ రెడ్ల గ్రామమైన పూసుకుంటలో ఉండే 12 మంది యువకులకు దమ్మపేట పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్సులను ఇప్పించడం జరిగినది.ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి చేతుల మీదుగా వారికి లైసెన్స్ కాపీలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో,ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువతకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు.వారికి క్రీడా పోటీలు నిర్వహించడం,ఉద్యోగాలు సాధించేలా వారిని ప్రోత్సహించి కోచింగ్ ఇప్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఎంతోమంది ఏజెన్సీ ప్రాంత యువత మద్యానికి బానిసలై వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని అన్నారు.కనీసం డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేకుండా పోలీసుల వాహన తలిఖీలలో పట్టుబడుతున్నారని అన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ లను ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం పూసుకుంట గ్రామ యువతను వారి గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :