తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీకి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. దీంతో త్వరలోనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. అయితే ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం 12,777 పంచాయతీలు, 5,982 ఎంపీటీసీ, 585 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ