తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేసీఆర్ కలల స్వప్నం సీతారామ ప్రాజెక్ట్ 31 నెలల పాలనలో భద్రాద్రి జిల్లాకు ఒరగబెట్టింది ఏంటి..? పక్కనే ఉన్న గోదావరి జలాలతోటి భద్రాద్రి జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మించారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆమె ఖండించారు. సీతారామ జలాలను భద్రాద్రి జిల్లా రైతాంగానికి పూర్తిగా ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించడం సరికాదన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా సాగు జలాలను తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని కోరితే ఆ రైతులను కోసి రక్తాన్ని పంటపై చల్లమని సీఎం రేవంత్ చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికే రెండు రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారని, రైతు భీమా పథకం అమలు చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తామని చెప్పారు. 31 నెలల పాలనలో భద్రాద్రి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కొబ్బరికాయలు కొట్టడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అరెస్ట్ అయిన వారిలో లచ్చిరాం, సూరిబాబు, సుందర్ పాసి, పూర్ణ, పాషా, లక్ష్మి, సోహెబ్, పేరం సందేశ్, కుమార్, మద్దెల సుదీర్, లక్కీనేని షణ్ముఖ సాయి ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ