తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ లో అప్రెంటీసులుగా విధులు నిర్వహిస్తున్న భూక్య వరప్రసాద్ కి క్రితంలో ప్రకృతి హరిత దీక్ష ఇచ్చి మొక్కలు నాటిచ్చిన ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు, సింగరేణియన్ కే.ఎన్ రాజశేఖర్ (మొక్కల రాజశేఖర్) వరప్రసాద్ ఈ దీక్షను తీసుకొని మొక్కలు నాటేది చూసి యువకులు చక్రి, మహేష్, నాయుడు శ్రీకర్ ప్రకృతి హరిత దీక్ష తీసుకుని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టినటువంటి "మాకే నామ్ ఏక్ పెడ్" కార్యక్రమంలో భాగంగా మొదటి మొక్కని అమ్మ పేరుతో శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం ఆవరణలో మందార మొక్కను నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న సొసైటీ డైరెక్టర్ రవి యువకులను అభినందిస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వృక్షాలుగా చేసి ప్రకృతిని కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ