Tuesday, 28 July 2026 07:12:26 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Date : 09 August 2024 04:43 PM Views : 885

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాలు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాలలో స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ముందుగా లక్ష్మీదేవి పల్లి మండలం అశోక్ నగర్ కాలనీలో సుమారు కోటి 50 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించనున్న సైడ్ కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుకుంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామని అన్నారు. అనంతరం అటవీశాఖ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా లక్ష్మీదేవి పల్లి మండలం చాటకొండ బీట్ లో స్వచ్ఛతనం - పచ్చదనం ముగింపు లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తర్వాత వన మహోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వన మహోత్సవ లక్ష్యాలని అందరూ సాధించాలని తెలిపారు. కొత్తగా పోడు వ్యవసాయం ఎవరు చేపట్టరాదని చేపట్టిన యెడల చర్యలు తప్పవని తెలిపారు. పోడు వ్యవసాయం చేసే రైతులకు అటవీ శాఖ అధికారులు జామాయిల్ పెంపకం తదితర పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు. అటవీ శాఖ అధికారులు పోడు వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజనులతో స్నేహభావంగా ఉండాలని అన్నారు. గత సంవత్సరం గిరిజనుల దాడిలో మరణించిన శ్రీనివాస్ రేంజర్ కుటుంబ సభ్యులకు 500 గజాల ఇంటి స్థలం పట్టాని రెవెన్యూ మంత్రిగా త్వరలో అందజేస్తామని తెలిపారు

పాల్వంచ మండలంలో సుమారు 50 లక్షల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. ఈ టెన్నిస్ కోర్టులో 70 నుంచి 80 మంది నిత్యం శిక్షణ పొందేలా రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులతో కలసి టెన్నిస్ ఆడారు. ఖేలో ఇండియా లో భాగంగా ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. క్రీడాకారులతో మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణంలోమొక్కను నాటారు. జిల్లా ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ద్వారా గ్రూప్ యాక్టివిటీ కింద ఓం సాయిరాం మహిళా సంఘం, వినాయక పేద ప్రాంత సమాఖ్య భరతమాత పట్టణ సమాఖ్య కొత్తగూడెం మున్సిపాలిటీ వారు 6,00,000 రూపాయల బ్యాంకు రుణ సహాయంతో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...

లంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వారికి ఋణ సదుపాయాలు అందించి వివిద ఆదాయాబివృద్ది కార్యక్రమం చేపట్టుటకు ప్రణాళికలను సిద్దం చేయడం జరిగింది అని అన్నారు. మహిళా సాదికారతను సాధించుటకు రాబోయే 5 సంవత్సరాలలో చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ సంఘ సభ్యులకు నైపుణ్యం పనిలో శిక్షణ ప్యాకింగ్ మరియు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడం పుడ్ ప్రోససింగ్ యూనిట్స్ ను నెలకొల్పడం మిని ఇండస్ట్రీయల్ పార్క్, వడ్డీ రుణాలు, లోన్స్, మరియు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయుట ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు.గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అక్క చెల్లెమ్మలందరు ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు.కొత్తగూడెం లో మొత్తం 5 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్‌లలో ఆహారం అమ్మ చేతి వంటలా ఉండాలన్నారు. నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డి ఆర్ డి ఓ విద్యా చందన, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి,జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు, మెప్మా డీఎంసీ రాజేష్, మహిళా సంఘ సభ్యులు, క్రీడాకారులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :