Tuesday, 28 July 2026 10:19:32 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పాల్వంచ టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 10 March 2026 02:27 PM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు . మంగళవారం పాల్వంచ పట్టణంలోని ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి బోధన విధానం, అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఐదో తరగతి విద్యార్థుల చదివే నైపుణ్యాన్ని పరీక్షించి వారి ప్రతిభను అభినందించారు. అనంతరం పాఠశాల మెస్‌, స్టోర్‌రూమ్‌, డైనింగ్ హాల్‌లను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను తనిఖీ చేశారు. మెస్ మానిటర్లుగా ఉన్న విద్యార్థులతో పాటు వంట సిబ్బందితో మాట్లాడి మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంట సమయంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నందుకు వంట సిబ్బందిని అభినందించారు. పాఠశాల ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాల అమరికను ప్రశంసించారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయానికి పుస్తకాలను అందించేందుకు సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల తలుపుల మరమ్మత్తులు, డ్రైనేజీ అవుట్‌లెట్ సమస్య పరిష్కారం, డైనింగ్ హాల్‌లో విద్యార్థులకు అవసరమైన బెంచీల ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పరిశుభ్రతను కలెక్టర్ అభినందించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైతిలి, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :