తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్థానిక నూతన గ్రంథాలయంలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడే వారు, పాఠకుల కోసం ఈ వైఫై సేవలను గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు బుధవారం సమకూర్చారు. వైఫై సదుపాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠకులు చైర్మన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన గ్రంథాలయం పై ఆధారపడి చదువుకునే వారి కోసం అప్పటికప్పుడే వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సమస్యను చెప్పగానే సహృదయంతో అర్థం చేసుకొని వైఫై సౌకర్యాన్ని కల్పించిన చైర్మన్ వీరబాబుకు గ్రంథ పాలకురాలు జి మణిమృదుల విద్యార్థినీ విద్యార్థులతో పాటు పాఠకులు కృతజ్ఞతలు తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ