తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గాంధీభవన్ సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణపాల్గొన్న ఏఐసీసీ అబ్జర్వర్ శక్తిసింహ గోయల్, టీపీసీసీ అబ్జర్వర్స్ టిపిసిసి ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.గాంధీ భవన్ లో డిసిసి అధ్యక్షుడి ఎన్నిక కోసం అధిష్టానం చేపట్టిన “సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ”కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ శక్తిసింహ గోయల్, టీపీసీసీ అబ్జర్వర్స్ టిపిసిసి ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పోరాటాలు చేసిన కార్యకర్తలు నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చి బాధ్యతాయుతమైన పదవులు ఇస్తుందన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు తాము ఇచ్చే దరఖాస్తులను నింపి ఇవ్వాలన్నారు. డీసీసీ ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఎవరైనా డీసీసీ పోటీలో ఉండవచ్చని ఈ ప్రక్రియలో ఎలాంటి లాబియింగ్ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతా రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, నాంపల్లి ఇంచార్జి ఫిరోజ్ ఖాన్, చంద్రశేఖర్, ఉస్మాన్ భాయ్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు భారీగా పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ