తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెద్దపల్లి మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ కల్లేపల్లి సతీష్ కుమార్‌ను కాంట్రాక్టర్ బిల్లు ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీకి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.నిందితుడి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇంటి సోదాల్లో రూ.32.31 లక్షల లెక్కల్లో చూపని నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అరెస్ట్ చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా కేసు దర్యాప్తులో ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ