Tuesday, 28 July 2026 12:18:32 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు

Date : 09 July 2026 03:31 PM Views : 389

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించడం లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం పట్టణంలోని మెదరబస్తీ ప్రాంతంలో కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు బుధవారం సాయంత్రం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చట్టపరమైన ప్రక్రియలు చేపట్టారు. ఈ ఘటనపై క్రైమ్ నెం.xxx/2026 కేసు నమోదు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ వెలువరించరు. గంజాయి వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబానికి మరియు సమాజానికి తీవ్ర హానికరమని వారికి అవగాహన కల్పించి, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డిఎస్పి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, గంజాయి కొనుగోలు, విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజలు మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :