తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు మండలంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా పట్టణం జలమయమైంది. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమితి సింగారం నుంచి మొద్దులగూడెం వెళ్లే రహదారిలోని బ్రిడ్జిపై కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల వల్ల మణుగూరులో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Admin
తెలుగు వెలుగు టీవీ