తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 19 తెలుగు వెలుగు ) జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుండి బదిలీలపై వెళ్తున్న సిబ్బందిని జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి మరియు సిబ్బంది సన్మానించారు. సుదీర్ఘకాలం జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో విశేషమైన సేవలందించిన హెడ్ కానిస్టేబుల్ అజ్మీర బుచ్చయ్య నాయక్, మహిళ కానిస్టేబుళ్లు అయిన శైలజ, సౌజన్యలను శాలువలతో సత్కరించి, గిఫ్ట్ అందించడం జరిగింది. వెళ్లే పోలీస్ స్టేషన్లో కూడా మంచిగా పని చేసి,పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని, ఈ సందర్భంగా వారికి సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ