Tuesday, 28 July 2026 03:00:18 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అంగరంగ వైభవంగా సేవాలాల్ సేన దశాబ్ది జెండా ఆవిష్కరణ

Date : 12 September 2025 05:10 PM Views : 590

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయం యందు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన దశాబ్ది జెండా ఆవిష్కరణ కార్యక్రమము అంగరంగ వైభవముగా జరిగింది సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ధారావత్ ప్రేమ్ చంద్ నాయక్ చేతుల మీదగా జెండా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు వారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక న్యాయం- రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా దశాబ్ద కాలంగా లంబాడి, బంజారాల మనుగడ సాధనకై పోరాడుతున్న సంఘం సేవాలాల్ సేన...ఆనాడు సంత్ శ్రీ తపస్వి రామరావు మహారాజ్ గారి చేతుల మీదగా ఆవిర్భావించి యుద్ధానికి సిద్ధం కండి అని చేతిలో ఆయుధం ఇచ్చి ఆశీర్వదించినటువంటి మహానీయుడి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో లంబాడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తూ నేటికీ పది సంవత్సరాలు కావస్తుంది. ఈ దశాబ్ద కాలంలో లంబాడి గిరిజన హక్కుల సాధనకై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేసి ఎన్నో హక్కులను సాధించుకుని ప్రతి బంజారా బిడ్డల స్థితిగతుల గురించి సామాజిక ఆర్థిక రాజకీయ కోణంలో ఎప్పటికప్పుడు వారిని సమీకరించి ఓటు చైతన్యం, రాజకీయ చైతన్యం పరచడంలో అలసట లేకుండా ముందడుగు వేసి ఎన్నో ఫలితాలను సాధించి జాతికి అంకితం చేయడం జరిగింది...స్వతంత్రం వచ్చి నేటికి 79 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ...అలాగే ఈ రాష్ట్రంలో ఎన్ని అగ్రకులాల ప్రభుత్వాలు మారినప్పటికీ అమాయక లంబాడి, బంజారా గిరిజనుల భవిష్యత్తు స్థితిగతులు మారే పరిస్థితి కనబడటం లేదు. ఈ దశాబ్ద కాలంలో చేసినటువంటి పోరాటా ఫలితం రేపటి రూపానికి మరో మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి లంబాడి గిరిజన బిడ్డలను దృష్టిలో పెట్టుకొని సమర శంఖాన్ని పూరించాలనే సంకల్పంతోముందుకు కదులుతున్నాం అని అన్నారు అదేవిధంగా సేవాలాల్ సేన దశాబ్ది జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ వివిధ సంఘాలు LHPS రాష్ట్ర అధ్యక్షులు గూగులోత్ రాజేష్ నాయక్, ఏజెన్సీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బానోతు లాల్ సింగ్ నాయక్, LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రమేష్ నాయక్, జగదంబ ప్రజా సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సేవల శ్రీ శంకర్ సాదు,బంజారా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ నాయక్, భారతీయ బోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ నాయక్, ఉద్యోగ సంఘ నాయకులుTG TTF రమేష్ నాయక్ హత్తి రామ్ నాయక్ తదితర సంఘాలు వారి యొక్క పూర్తి మద్దతును ఈ కార్యక్రమానికి తెలియజేశారు వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సేవాలాల్ సేన ఉద్యమాభి వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కాకార్యదర్ రేఖ్య నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి నాయక్, టి టి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మంగీలాల్ నాయక్, గుగులోతు శ్రీను నాయక్ , పూర్ణ చందర్ , బానోతు శ్రీనివాస్ ,సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ రమేష్ నాయక్, అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్, LHPS జిల్లా అధ్యక్షులు కేశవ నాయక్, ఏజెన్సీ పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు మాలోతు అశోక్ నాయక్, జానకిరామ్ నాయక్, మోహన్ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయక్, టేకులపల్లి మండల అధ్యక్షులు బానోతు కిషన్ నాయక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :