Monday, 27 July 2026 01:02:04 AM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

ఆర్బిఐ90 క్విజ్ పై డిగ్రీ విద్యార్థులకు అవగాహన

Date : 11 September 2024 07:27 PM Views : 782

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి క్విజ్ కండక్ట్ చేసి బహుమతులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలమేరకు డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాల్వంచ లో విద్యార్థులకు అవగాహన కల్పించి స్టూడెంట్స్ ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్బిఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఆర్బిఐ 90 పేరుతో క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని, విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు నాలుగు దశలో ఉంటాయని మొదటగా ఆన్లైన్ ప్రారంభమై స్టేట్, జోనల్, ఫైనల్ దశల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. ఆసక్తి ఉత్సాహం ఉన్న విద్యార్థులు https://www.rbi90quiz.in వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని, 2024 సెప్టెంబర్ 1 నాటికి 25 ఏళ్లు వయసులోపు ఉండి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ పోటీలకి అర్హులని వారు తెలియజేశారు.

ఈ క్విజ్ లో పాల్గొనేందుకు ఒక కళాశాల నుంచి ఎంతమంది అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఆంగ్లం హిందీ భాషల్లో పోటీ ఉంటుందని, దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, ఆర్బిఐ డిజిటల్ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, క్రీడలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, సమకాలిని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ గా ఇస్తారని, దీనిలో ప్రైజ్ మనీ వివరాలు స్టేట్ లెవెల్ లో మొదటి బహుమతి రెండు లక్షలు, ద్వితీయ బహుమతి లక్షన్నర, తృతీయ బహుమతి లక్ష ఉంటుందని అదేవిధంగా జోనల్ లెవెల్ లో ఐదు లక్షలు, నాలుగు లక్షలు, మూడు లక్షలు, నేషనల్ లెవెల్ లో పది లక్షలు, ఎనిమిది లక్షలు, ఆరు లక్షలు అందజేస్తారని, క్విజ్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలియచేసారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఈనెల 17 వరకు ఉంటుందని, ఆన్లైన్ క్విజ్ ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని అర్హులైన ప్రతి విద్యార్థి క్విజ్ లో పాల్గొని సర్టిఫికెట్ పొందవచ్చునని ప్రతిభ కనబరిచి బహుమతి కూడా పొందవచ్చునని ఈ అద్భుత అవకాశం వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :