తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామం నందు తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని దానికి గల కారణం లైన్ మెన్ ను వివరణ అడగగా ఆ సమస్య నరసాపురం టౌన్ ఫీడర్ పై మాచినేనిపేట తండా టౌన్ ఫీడర్ ను కూడా జతచేసి నడపడం వల్ల తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని వివరించారని , దాన్ని సపరేట్ చేయాలని మరియు గ్రామ శివారు ఇండ్లకు నూతన విద్యుత్ స్తంభాలు మంజూరి చేయాలని కోరుతూ మండల విద్యుత్ శాఖ అధికారికి గ్రామ సర్పంచ్ సంగం లక్ష్మీ కుమారి, గ్రామ పెద్దలతో కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మండల విద్యుత్ శాఖ అధికారి గ్రామ అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిస్తామని, నిధులు మంజూరి రాగానే తప్పకుండా అవసరమైన పనులు చేపడతామని మండల విద్యుత్ అధికారి హామీ ఇవ్వడం జరిగిందని నరసాపురం గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ