Tuesday, 28 July 2026 12:41:06 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ వైద్యంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 07 April 2026 06:43 PM Views : 120

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాల్వంచ వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న జిల్లాలో ప్రజలకు నాణ్యమైన మరియు అందుబాటులో ఉన్న వైద్య సేవలను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం అత్యంత కీలకమని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి అధికారి, సిబ్బందిపై ఉన్న బాధ్యతగా తెలిపారు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 6 నుండి 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న నమ్మకం విశేషమని తెలిపారు .క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి అవార్డులను స్వీకరించేందుకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతికి వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు మరియు ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 43 మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దారు దారా ప్రసాద్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ప్రసాద్ నాయక్, డాక్టర్ స్పందన, డాక్టర్ తేజస్వి, వైద్య శాఖ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :