Tuesday, 28 July 2026 03:26:29 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వన మహోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Date : 18 June 2026 08:25 PM Views : 73

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వన మహోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిన్నెరసాని తెలంగాణకు ఊపిరితిత్తుల వంటిది – ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జిల్లాలో 55 లక్షల మొక్కల నాటడమే లక్ష్యం – జిల్లా కలెక్టర్ అంకిత్.రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాలతో పాటు కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో భాగంగా కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం .45 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, ట్రెక్కింగ్ సౌకర్యం, బటర్‌ఫ్లై పార్క్, జింకల పార్కులో ఫీడింగ్ షెడ్, సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ అంకిత్ సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని పేర్కొన్నారు. కిన్నెరసాని తెలంగాణకు ఊపిరితిత్తుల వంటిదని అన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో పాటు కొత్తగా అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కిన్నెరసానిని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కిన్నెరసానిలో తీగల వంతెన నిర్మాణం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, అద్దాల మేడ, జూ పార్కు, బోటు షికారు, పర్యాటక హోటల్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మణుగూరులోని వేడి నీటి గుంతల ప్రాంతం వరకు కిన్నెరసాని సఫారీ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా అతి త్వరలో కొత్తగూడెం పట్టణానికి రూ.500 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు, అతి పెద్ద ఫ్లై ఓవర్ బ్రేడ్జి మంజూరుకు చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. అటవీ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లాలో హరితాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 50 శాతం భూభాగం అటవీ ప్రాంతంగా ఉందని, జిల్లా ప్రజల జీవన విధానం అడవులతో ముడిపడి ఉందన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 42 శాఖలకు మొక్కల నాటే బాధ్యతలను కేటాయించామని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. గత 24 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవడం ఆందోళనకర విషయమని, పర్యావరణ సమతుల్యత కోసం విస్తృత స్థాయిలో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. నాటిన మొక్కల్లో కనీసం 95 శాతం మొక్కలు వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అని తెలిపారు. జిల్లాలో సుమారు ఎనిమిది లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నదని పేర్కొన్నారు. గతంలో కొంత మేర అటవీ భూమిని కోల్పోయినప్పటికీ ప్రస్తుతం అటవీ సంపద పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అభివృద్ధి, అటవీ సంరక్షణ, గిరిజనుల సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా కిన్నెరసానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం సఫారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సర్పంచ్ వజ్జా రామకృష్ణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎఫ్డిఓ లు బాబు, చారి, తాసిల్దార్ ధారా ప్రసాద్, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రకృతి ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :