Tuesday, 28 July 2026 12:21:07 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సూరీమేని జనార్ధన్ అకాల మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు

Date : 25 August 2025 07:53 PM Views : 672

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 19వ డివిజన్లోని వన్నం దాస్ గడ్డ శాఖ వన్ కార్యదర్శి సూరీమేని జనార్ధన్ అకాల మరణం సిపి ఐ పార్టీకి తీరనిలోటని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు. బ్రెయిన్ డెడ్ తో ఆసుపత్రిలో చికిత్స పొందు సీనియర్ కామ్రేడ్ శాఖా కార్యదర్శి సూరీమేని జనార్ధన్ మరణ వార్త తెలుసుకున్న సాబీర్ పాష ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పార్టీ జెండా కప్పి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. వన్నం దాస్ గడ్డ ప్రాంతం అలాగే సిపిఐ పార్టీకి ఆయన మరణం తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆకర్షిత రాజకీయాల్లో తాను నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ ప్రాంత సిపిఐ నిర్మాణం కోసం ఆయన తుది శ్వాస వరకు సిపిఐ పార్టీ లో ఉండి మరణించారని అన్నారు.

ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం 30 ఆటోలతో ర్యాలీగా వెళ్లి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య ,జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు , బుక్య శ్రీనివాస్ మునిగడప పద్మ, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మరి గోపి, నాయకులు తుముల శ్రీనివాస్, మండల రాజు, గుత్తుల శ్రీనివాస్, కమల్ సీనియర్ నాయకులు గంటాడు కోటేశ్వరరావు, బయన్న ఈశ్వరయ్య, అజ్మత్ పాషా, ఉన్నందాస్ గడ్డ శాఖ టు కార్యదర్శి ఎస్కే జలీల్, నాయకులు తోగరు నరేంద్ర కుమార్, బానోతు చందర్, గుగులోతు శంకర్ ఏవైఎఫ్ జిల్లా నాయకులు ఖయ్యూం బానోత్ శ్రీనివాస్, దాట్ల శ్రావణ్ మహిళా నాయకురాలు మునిగడప పద్మ, కరిష్మా రత్నకుమారి, మహబూబి,షాహిన్, విజయలక్ష్మి ,భాగ్య, మార్తమ్మ ,కైసర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :