Tuesday, 28 July 2026 08:10:37 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

లూయిస్ బ్రెయిలీ స్ఫూర్తితో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. తుకారం రాథోడ్, జే.ఎం.స్వర్ణలతా లెనిన.

Date : 09 January 2026 07:16 PM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతోత్సవ వేడుకలను జిల్లా సంక్షేమ శాఖ వారి కార్యాలయ మీటింగ్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. బ్రెయిలీ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ మరియు జిల్లా సంక్షేమ శాఖ అధికారినీ జే.ఎం.స్వర్ణలతా లెనిన పాల్గొన్నారు. బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మాట్లాడుతూ బ్రెయిలీ కనిపెట్టిన చుక్కల లిపి ద్వారా అందుల జీవితాలలో వెలుగులు నింపారని ఈ లిపి ద్వారా అందులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అదిరోహించారని లూయిస్ త్యాగాన్ని కీర్తించారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని దివ్యాంగుల వివాహ ప్రోత్సాహం, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్,ఈపాస్ ద్వారా సహాయ ఉపకరణాలు,ఓబిఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. డి ఎం హెచ్ ఓ అధికారి తుకారం రాథోడ్ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, బ్రెయిలీ లిపి కనుగొనడం ద్వారా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారని కీర్తించారు. అంధులైన ఉద్యోగస్తులకు, అందుల కొరకు వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారికి సన్మానించి గోడ గడియారాలు బహుకరించారు. ఈ జయంతోత్సవాలకు బ్లైండ్ అసోసియేషన్ సభ్యులు ఎం.నరేందర్, రాజ్ కిరణ్, రమణయ్య, ఉపేంద్రమ్మ, అనుష, కిరణ్, వరప్రసాద్, నాగేశ్వరరావు, నరేష్, ప్రవీణ్ మరియు డిహెచ్ఈడబ్ల్యు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :