Tuesday, 28 July 2026 02:33:05 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భూసేకరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 14 July 2026 05:09 PM Views : 107

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి*చంద్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం చంద్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తిప్పనపల్లి గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులు, మద్దుకూరు గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, అనంతరం చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూసేకరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియలను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, క్రీడలకు అవసరమైన ప్రోత్సాహం అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముందుగా తిప్పనపల్లి గ్రామంలో కొనసాగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులను పరిశీలించారు. సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిప్పనపల్లి గ్రామ పరిధిలో మొత్తం 70 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రతిరోజూ సుమారు 15 ఎకరాల మేర సర్వే చేపడుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి భూ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం మద్దుకూరు గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, డిజిటలైజేషన్, రికార్డుల నిర్వహణను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 65 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు వివరించగా, మిగిలిన ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా డిజిటలైజేషన్ చేపట్టాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న సాంబార్ పలుచగా ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, యూనిఫాంల పంపిణీపై ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి విద్యార్థి వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, చంద్రుగొండ తహసీల్దార్ జగదీశ్వరరావు, ఎంపీడీవో అశోక్, ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :