తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ జిల్లా వైద్యాధికారులు, సిబ్బందితో నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో పల్స్ పోలియో, కార్యక్రమం పై కీలక సూచనలు చేశారు. జూన్ 28 నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 98 818 మంది 0-5 సంవత్సరంలోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం925 బూత్ లు ,38 ట్రాన్సిట్ పాయింట్లు , 1001టీములు ఏర్పాటు చేయడం జరిగింది పల్స్ పోలియో కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయడం, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని డా. తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పల్స్ పోలియో బ్యానర్ను కూడా ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో Dr రాకేష్ ప్రోగ్రాం అధికారి, Dr ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, సిహెచ్ఓ నాగభూషణం హెచ్ ఇ వో రాంప్రసాద్, రామారావు, హరికృష్ణ , ప్రియా నర్సింగ్ ఆఫీసర్, పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ