తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండల కేంద్రంలోని చేతన్ జ్యువెలరీ షాప్‌లో ఫేక్ ఫోన్‌పే యాప్‌ను చూపించి రూ. 97 వేల విలువైన బంగారాన్ని కాజేసిన ఘరానా మోసం సోమవారం వెలుగుచూసింది.ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బంగారం దుకాణాలను లక్ష్యంగా చేసుకొని పలు రకాల ఘరానా మోసాలు జరుగుతున్నాయి. ఒరిజినల్ ఆన్‌లైన్ పేమెంట్‌కు బదులుగా, స్క్రీన్‌పై డబ్బులు పంపినట్లు చూపే ఫేక్ ఫోన్‌పే (Fake PhonePe) యాప్‌ను యజమానికి చూపించి ఖాతాలోకి నగదు జమకాకుండానే రూ. 97 వేల విలువైన బంగారు ఆభరణాలతో నిందితుడు పరారయ్యాడు. షాపు యజమాని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా స్టేషన్ ఎస్సై జినత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ