Tuesday, 28 July 2026 12:42:41 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఇందిరమ్మ ఇండ్ల ఎల్ -1 జాబితాను శనివారం లోగా పూర్తి చేయాలి.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 12 March 2025 08:53 PM Views : 510

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఉపాధి హామీ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అతను విద్యాచందన తో కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు క్లస్టర్ వారిగా పని దినాలు చేపడుతున్న పనులు, ఆస్తి పన్ను వసూలు పురోగతి, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ఎల్ ఆర్ ఎస్ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై జిల్లాలోని తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించేందుకు ఎక్కువ అవకాశం గల పనులు పై దృష్టి సారించాలని, ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ఫారం పాండ్స్, ఫీడర్ ఛానల్ పనులు, రోడ్డు ఫార్మేషన్,ట్రంచ్ వర్కులు, బౌండరీలు తదితర పనులకు సంబంధించి అంశాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు. క్లస్టర్ల వారీగా చేపట్టే పనులలో లేబర్ మొబలైజేషన్ ఎక్కువగా ఉండాలని, వారికి పని దినాలు కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా లో సమస్యలను సత్వరమే పరిష్కరించి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎల్ వన్ జాబితాను శనివారంలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పిడి హౌసింగ్ శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు , మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, నలిని, డి ఎల్ పి ఓ సుధీర్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :