Tuesday, 28 July 2026 03:58:54 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రధాన లక్ష్యం.

Date : 29 April 2026 07:47 PM Views : 286

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొంగరకలాన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగిన "గిరిదర్శక్" కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రాద్రి కొత్తగూడెం,ములుగు జిల్లాలను ప్రత్యేక దృష్టి ఉన్న జిల్లాలుగా గుర్తించడం జరిగింది.గతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పుడు నివసించే యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా మంగళవారం కొంగరకళాన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గిరిదర్శక్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.భద్రాచలం,పర్ణశాల,కిన్నెరసాని వంటి ఆధ్యాత్మిక,ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలు కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన యువకులను గుర్తించి వారికి తగిన శిక్షణను ఇప్పించి ఇట్టి పర్యాటక స్థలాలలో వారిని నియమించే కార్యక్రమమే ఈ గిరిదర్శక్.మొదటి విడుతలో భాగంగా పదిమంది యువకులను గుర్తించి వారికి 21 నుండి 28 రోజుల పాటు జిల్లాలోని ఆయా ప్రదేశాల గురించి అవగాహన,మాట్లాడే తీరు,ప్రకృతి మరియు వన్యప్రాణుల గురించి జ్ఞానం,ప్రథమ చికిత్స వంటి విషయాలలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.అటవీ,దేవాదాయ పర్యాటక,గిరిజనాభివృద్ధి శాఖలతో సమన్వయంతో పోలీసు శాఖ ఈ అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడే నైపుణ్యం,ఆత్మవిశ్వాసం,స్థానిక జ్ఞానం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి తదుపరి సరైన శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు.శిక్షణ పొందిన అభ్యర్థులకు వేతనాన్ని కల్పిస్తూ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాల్లో భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే ఉంది.వినూత్నంగా చేపడుతున్న ఈ "గిరిదర్శక్" కార్యక్రమం ద్వారా ఎంతోమంది గిరిజన యువతకు మేలు జరుగుతుందని భావిస్తున్నామని ఎస్పీ ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :