తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం (తెలుగు వెలుగు) ఆగస్టు 17 శనివారం జూలూరుపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో ఆర్ జి కే ఆర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ మౌనిత దేవనాద్ పీజీ విద్యార్థిని హత్యను నిరసిస్తూ పి ఎస్ సి జూలూరుపాడు సిబ్బంది తో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంనిర్వహించారు. వైద్యులు మరియు వైద్యసిబ్బందిపై దాడులు అరికట్టాలని మహిళా వైద్యులకు మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలని మహిళల్ని గౌరవించాలని తెలియజేశారు. డాక్టర్ మౌనితా దేవనాధుని మీద హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ మౌనిత దేవనాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పి ఎస్ సి సిబ్బంది మౌనం వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు సిహెచ్ రామకృష్ణ . హెచ్ఎస్ రత్నకుమార్ . యూడీసీ వెంకటేశ్వర్లు. స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంలు మరియు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ