Tuesday, 28 July 2026 03:26:38 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పూర్తయిన ఇందిరమ్మ గృహాలకు వెంటనే బిల్లులు ఇవ్వాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 17 June 2026 06:40 PM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఉమ్మడి కుటుంబాల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి జీవనోపాధి వాహనం ఉందనే నెపంతో దరఖాస్తులు తిరస్కరించొద్దు ఇళ్లు ప్రారంభించని వారి నుండి 'నాట్ విల్లింగ్' పత్రాలు తీసుకోవాలి మొదటి విడతలోని మిగిలిన 199 మందికి ఇళ్లు మంజూరు చేయాలి అధికారుల సమీక్షాసమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉమ్మడి కుటుంబాల పెండింగ్ ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల, నిర్మాణం పూర్తిచేసుకున్న ఇండ్ల లబ్దిదారులకు పెండింగ్ బిల్లులు తక్షణమే క్లియర్ చేసి పేద లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖా అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తూ, సొంత ఇల్లు లేని లబ్ధిదారుల పేమెంట్లను సాంకేతిక కారణాలతో నిలిపివేయడం సరికాదన్నారు. గతంలో ఇల్లు ఉండి ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరిన వారిని కూడా ఆదుకోవాలని, 600 చదరపు అడుగుల నిబంధనతో సమ్మతి పత్రాల పేరిట బిల్లులు ఆపవద్దని ఆదేశించారు. జీవనోపాధి కోసం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయనే కారణంతో దరఖాస్తులను తిరస్కరించడం తగదని, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలు స్పష్టంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బేస్, రూఫ్, స్లాబ్ లెవల్ వరకు ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇల్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించని వారి నుంచి నాట్ విల్లింగ్ లెటర్లు తీసుకోవాలని, మొదటి విడతలో మిగిలిపోయిన 199 మంది పేర్లను త్వరగా మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. రెండో విడతకు సంబందించిన ఇందిరమ్మ ఇండ్ల వివరాల సేకరణ, మంజూరు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, మేయర్ మూడ్ గణేష్, హోసింగ్ ఇంచార్జి పిడి సవే రామ్, డీఈ ఖలీల్, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపిడివోలు సుభాషిణి, సుస్మిత, భారతి, ఏఈలు రమేష్ బాబు, డేవిడ్, నసీరుద్దీన్, పుష్ప, లాల్ సాహెబ్, హసిత, బాధిత లబ్ధిదారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :