Tuesday, 28 July 2026 07:57:24 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 13 December 2025 08:43 PM Views : 251

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం క్లబ్ నందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శని వారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన తాగునీటి వసతి, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు తదితర అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అలాగే పీ.ఓలు, ఓ.పీ.ఓలతో కూడిన పోలింగ్ బృందాలన్నీ హాజరయ్యారా లేదా అన్న విషయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఎటువంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది ప్రతి అధికారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు.పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి పోలింగ్ సామాగ్రి, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సంబంధిత ఆర్‌.ఓలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత పై అధికారులను సంప్రదించి పరిష్కారం పొందాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తెలిపారు.పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :