తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ హోమియోపతి డే వేడుకలు పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఆదివాసీల గ్రామమైన మోకాళ్లగుంపులో వేసవి సందర్భంగా శుక్రవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ఎస్ జీ ఎఫ్ ) భద్రాద్రి ఉమెన్స్ గిల్డ్ విభాగం ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం మోకాళ్ల గుంపు ఆదివాసీల గ్రామంలో ఆదివాసీ కుటుంబాలకు వేసవిలో ఎండతాపాన్ని అధిగమించుటకు , మట్టికుండలు పంపిణీ చేశారు. పుచ్చ కాయలు కూడా అందజేశారు. ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఎస్ జి ఎఫ్ ఉమెన్స్ గిల్డ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ నూరి మెహరున్నీసా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నూరి మెహరున్నిసా మాతృమూర్తి గౌసియా, ఆమె కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేశారు. ఎస్జీ ఎఫ్ జిల్లా కోర్డినేటర్ ఎం .జ్యోతిరాణి,ఎస్ జీ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లోగాని శ్రీనివాస్,రాష్ట్ర కో ఆర్డినేటర్ మహమ్మద్ ఖాసీం, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమళ్ల బ్రమ్మంచారి,ఆర్గనైజింగ్ కార్యదర్శి కళ్యాణి, జిల్లా కోశాధికారి సమ్మయ్య, ఎస్ జీ ఎఫ్ ప్రతి నిధులు మహమ్మద్ నసీమ్ పాషా, గౌస్యా,చుంచు అంజమ్మ,పంచెల నాగభూషణం, శనగ రామచందర్ రావు,థామస్, ఆశా వర్కర్స్ శంకరమ్మ, యశోద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి రాణి సారధ్యంలో ఉమెన్స్ గిల్డ్ మెంబెర్స్ ప్రముఖ వైద్యులు డాక్టర్ నూరిమెహరూన్నిసా,ఆమె మాతృమూర్తి ఏస్కె. గౌస్యా లకు ఘనంగా సన్మానం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ