తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఆర్మడ్ రిజర్వ్ అధికారుల ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బందికి వారం రోజుల పాటు యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.పోలీస్ శాఖలో వినియోగించే అన్ని రకాల ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారు.జిల్లాలోని మొత్తం 1469 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ నకు హాజరు కానున్నారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఏడాది పోలీస్ శాఖలో వినియోగించే ఆయుధాలతో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్,హేమచంద్రపురం నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది.విడతల వారీగా జిల్లాలోని పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ నందు పాల్గొననున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ