తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (08-03-2026) న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం టీచర్స్ భవన్ లో జిల్లా కార్యదర్శి ఎం పద్మారాణి గారి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి చావా దుర్గ భవాని గారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ నేడు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నప్పటికీ ఇంకా మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, సోషల్ మీడియా రూపంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానంగా వారు పనిచేసే ప్రాంతాలలో సరైన సౌకర్యాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళ అక్రమ రవాణా వంటి అనేక దాడులు ఇంకా మహిళలపై జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయడం కొరకు కఠిన తరమైన చట్టాలను చేయాలని కోరారు. బయట మహిళా చైతన్యం కలిగించేలా కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించాలని కోరారు. ఈ మహిళా చైతన్య సదస్సులో జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి నీరజ గారు, కొత్తగూడెం ఎంఈఓ మధురవాణి గారు, సుజాతనగర్ ఎంఈఓ లీలా గారు కూడా సదస్సులో పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ మహిళా చైతన్యం పెరగాలని, సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పదని తెలిపారు. ఈ సమస్యలు ప్రభుత్వ వైద్యశాల ఆర్థోపెడిక్ వైద్యులు వైస్ శ్రావణి గారు మాట్లాడుతూ ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి తీసుకోవలసిన ఆహారం వంటి విషయాలను వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతులు హాజరైన అతిథుల చేత అందించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కృష్ణ, మహిళా ఉపాధ్యాయులు జానకి, వెంకటమ్మ, స్వర్ణలత, పద్మ, వసుంధర, భవాని, తులసి, వాలమ్మ, ఆర్ నాగ జ్యోతి, వెంకటమ్మ,రజియా బేగం,జిల్లా ఉపాధ్యక్షులు ఎం రాజయ్య,జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ డి దాసు, మండల బాధ్యులు రాందాస్, జి నాగేశ్వరావు, లక్ష్మణ్, ఎన్. కిరణ్,రాజారావు, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ