తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పాల్వంచ గిరిజన గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. NCC, NSSలో చేరే అవకాశం ఉంటుందని, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ