తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) భద్రాచలంకు చెందిన HNTC నర్సరీ గరిమెళ్ళ పాడు, ప్రశాంత్ నగర్ గ్రామపంచాయతీ, చుంచుపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గల వెదురు బొంగులు (సుమారు 98 పొదలు) మరియు పాత ఇనుప తుక్కు (సుమారు 500 కేజీలు) వేలం వేయుటకు నిర్ధారించడమైనదని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉత్సాహవంతులు ఎవరైనా ధారావతు సొమ్ము 3000 రూపాయలు చెల్లించి ఈనెల 10వ తేదీన ఉదయం 10:30 గంటలకు HNTC నర్సరీ గరిమెళ్ళపాడు నందు వేలం పాటలో పాల్గొనవలెనని ఆయన కోరుచూ, వేలం రద్దు చేయుటకు లేదా తిరిగి ప్రారంభం చేయుట పూర్తి అధికారం ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలంకలదని ఆయన సూచించారు. అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడమైనది
Admin
తెలుగు వెలుగు టీవీ