తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు, పరిసర గ్రామాలను కలుపుతూ హెచ్ఎండిఏ తరహాలో కొత్తగూడెం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (కుడ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో నెంబర్ 177 జారీ అయ్యింది. 'కుడ' ఏర్పాటుతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి సాధిస్తాయని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలుమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఫలితంగా ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలుగా రోజురోజుకు విస్తరిస్తున్నాయని, షెడ్యూల్ భూములు, సింగరేణి, ఇతర పరిశ్రమల భూములు ఎక్కువగా ఉండటంతో 'కుడ' ఏర్పాటు వలన ఈ ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి సాదించేందుకు దోహదపడుతుందన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను అభివృద్ధిలో మహానగరాలకు ధీటుగా అభివృద్ధి సాధించాలంటే 'కుడ' ఏర్పాటు తప్పనిసరిగా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 'కుడ'ఏర్పాటుకు ఆమోదం తెలిపి జీవో జారీచేసింది కూనంనేని తెలిపారు. అనతికాలంలో జంట పట్టణాలతోపాటు నియోజకవర్గం ఊహించని రీతిలో అభివృద్ధి సాదిస్తుందని, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తన విజ్ఞప్తిపై స్పందించి 'కుడ' ఏర్పాటుకు జీవో జారీచేసిన ప్రభుత్వానికి కూనంనేని అభినందనలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ