తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం మాచినేని పేట పంచాయతీలో గత ప్రభుత్వం లో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణం జరిగింది. కానీ రోడ్ల కంటే ముందే పాత డ్రైనేజీ చాలా ఎత్తుతక్కువగా ఉండటం వలన గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎదురెదురుగా వాహనాలు వస్తే రివర్స్ లో ఊరి బయటకు వెళ్ళవలసిందేనని.
డ్రైనేజీని ఎత్తు పెంచి సిసి రోడ్డు కు సమాంతరంగా మట్టి పోయాలని. మరియు డ్రైనేజీ కూడా అపరిశుభ్రంగా ఉండి దోమలకు నిలయంగా మారాయి అని గ్రామంలో అందరికీ విష జ్వరాలు ఉన్నాయని అధికారులు ఎవరు మా పంచాయతీని పట్టించుకోవట్లేదు అని మీడియా ముఖంగా విన్నవించుకున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ