తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 6 తెలుగు వెలుగు) భద్రాచలం పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య ను దర్శించుకుని భద్రాద్రి రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వెంట తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సకుటుంబంగా హాజరయ్యారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే అధికారులు హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ