తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 19తెలుగు వెలుగు ) : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బి రవి వినాయక చవితి పండగ గూర్చి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాలతో, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మి సూచనల మేరకు మండల ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు. వినాయక ప్రతిమ ప్రతిష్టాపనా మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా ఆన్లైన్ నమోదు చేసుకోవాలని, వినాయక మండపాలు ఏర్పాటునకు తప్పనిసరిగా కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేసుకోవాలని, మొదటిగా విద్యుత్ శాఖ నుండి పర్మిషన్ తీసుకోవాలని, మండపాల దగ్గర ఎటువంటి గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ వారిదేనని, సౌండ్ పొల్యూషన్ ద్వారా ఎవరికి ఇబ్బంది కలగకుండా రాత్రి 8 గంటల తర్వాత సౌండ్ సిస్టం, మైక్ హారన్స్ బంద్ చేయాలని ఈ సూచనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ