Tuesday, 28 July 2026 12:40:21 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగం చదవాలి : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 26 November 2025 03:04 PM Views : 236

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రతీ ఒక్కరూ రాజ్యాంగం చదవాలని,రాజ్యాంగం తోనే సామాజిక సాధికారత సాధ్యమవుతుందని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు అధ్యక్షతన ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశ మూల వాసులైన బహుజనులకు మానవ హక్కులు నిరాకరించబడి జంతువుల కంటే హీనంగా చూడబడుతూ అంటరానితనం అసమానత వేళ్ళూని ఉన్న సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మార్పును కోరుతూ ఎన్నో హక్కులను సాధించడం వల్లనే ఈనాడు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకే కాకుండా అగ్ర కులాలలోని పేదలకు,మహిళలకు కూడా హక్కులు కల్పించబడ్డాయని,ఉదాహరణకు విద్యా హక్కు,స్వేచ్ఛగా మాట్లాడే హక్కు,ఆస్తి హక్కు,ఓటు హక్కు,మతస్వేచ్ఛ వంటి ఎన్నో హక్కులు పొందుతున్నామని,26 నవంబర్1949 భారత రాజ్యాంగం ఆమోదించబడిన ఘనమైన రోజు అని ప్రతీ భారతీయ పౌరుడు గర్వంగా నేటి రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.జై భీమ్ రావ్ భారత్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రజాస్వామ్యం,భారత రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.రాజ్యాంగేతర శక్తులు రాజ్యాంగం మీద విమర్శలు చేస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతీ వ్యక్తిపై ఉందని రాజ్యాంగాన్ని మన ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకోవాలని,అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్,ప్రమోద్,కుంపటి శివ,బిట్టు,నీలా,స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :