తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం చేసి రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించారు. కాకర్ల నుండి పడమటి నర్సాపురం వరకు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి పోవడంతో తరచూ ప్రమాదాలు జరు గుతున్నాయి అని. ఆటో యూని యన్ సభ్యులంతా కలిసి శ్రమ దానం చేశారు. యూనియన్ సభ్యులు మాట్లాడుతూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫండ్స్ లేవంటూ పట్టించుకోవట్లేదని. మాకు అన్నం పెట్టే ఆటోలకు ప్రమాదాలు జరిగితే జీవించలేమని మాకు మేమే స్వతహాగా శ్రమదానం చేసుకొని నాలుగు కిలోమీటర్ల రహదారిని శుభ్రం చేసుకుంటున్నాం అంటున్నారు. ఈ కార్యక్రమంలో కొండే రమేష్, గున్నం వెంకటేశ్వర్లు, నరసింహారావు,వెంకటప్పయ్య, మురళి, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ