తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలై 11 జూలూరుపాడు మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ప్రభుత్వ పథకాలు పొందాలంటే భూధార్ సంఖ్య తప్పనిసరి అని, సొంత భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం ఆధార్ కార్డు మాదిరిగానే భూదారు సంఖ్యను కేటాయిస్తుందని ఇది భూమి హక్కులను ధృవీకరించే అధికారిక రికార్డుగా ఉపయోగపడుతుంది ఈ కొత్త విధానం ద్వారా రైతులకు మరింత లబ్ధి కలిగించనుంది భూదారి సంఖ్య పొందకపోతే ప్రభుత్వ పథకాలు మరియు బ్యాంకు రుణాలు అందుబాటులో ఉండవు కాబట్టి వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి. రిజిస్ట్రేషన్ కొరకురైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, 1B అడంగల్, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకొని వారి రెవెన్యూ పరిధిలో గల రైతు వేదిక దగ్గరికి వెళ్లాలని సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ