తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి ప్రదాత తెలంగాణ సాధకుడు ఉద్యమ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థిరస్థాయిగా ఉంటాడని, గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సాధించిన కేసీఆర్ ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అని నిరూపించిన బలమైన ఉద్యమనేత అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, లచ్చిరామ్, శివ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ప్రసాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూ ఘర్ మాజీ చైర్మన్ అన్వర్ పాషా, జయరామ్, కుమారుడు చౌహాన్, తొగరు రాజశేఖర్, హుస్సేన్, ఖాజా, సురిబాబు, జయరాజు, నరసయ్య, టైలరన శ్రీను, వందలాది మంది మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ