Tuesday, 28 July 2026 12:30:43 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సైబర్ క్రైమ్ బారినపడిన భాదితుడి నగదును కోల్పోకుండా కాపాడిన సైబర్ సెక్యూరిటీ అధికారులు

Date : 30 November 2025 10:39 AM Views : 142

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సైబర్ క్రైమ్ ను గుర్తించి సైబర్ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించిన బ్యాంక్ అఫ్ బరోడా మేనేజర్ ను సత్కరించిన డిఎస్పీ అశోక్ భద్రాద్రి కొత్తగూడెం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పి బి.అశోక్,సిఐ సముద్రాల జితేందర్ సైబర్ క్రైమ్ బాధితుని గుర్తించి అతని ఐదు లక్షల రూపాయల నగదును కాపాడిన బ్యాంక్ ఆఫ్ బరోడా,బ్రాంచ్ మేనేజర్ ఐ.నరేందర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు.శుక్రవారం నాడు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్లో పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తించిన బ్యాంక్ ఆఫ్ బరోడా,కొత్తగూడెం బ్రాంచ్ సిబ్బంది మరియు మేనేజర్ ఐ.నరేందర్ కొత్తగూడెం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సమాచారం ఇవ్వడంతో,తక్షణమే స్పందించిన సైబర్ బ్యూరో సిబ్బంది బాధితుని చేరుకుని,కౌన్సిలింగ్ నిర్వహించి,అతడు సైబర్ క్రైమ్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఐదు లక్షల రూపాయలను కాపాడడం జరిగింది.బాధితునికి పది రోజుల క్రితం టెలిగ్రామ్ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ యాప్ లింకును పంపి,యాప్ లో పెట్టుబడి పెడితే తమ డబ్బు రెండు మూడు రెట్లు అవుతాయని చెప్పారు.బాధితుడు అది సైబర్ నేరస్తుల పన్నాగమని గ్రహించక,ఇవ్వబడిన లింకు ద్వారా యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని,మొదట రెండు విడుతలుగా 10 వేల రూపాయలు,20వేలు పెట్టుబడులు పెట్టడం జరిగింది.సైబర్ నేరగాళ్లు బాధితున్ని నమ్మించడం కోసం మొదటగా చెప్పినట్లుగా అతనికి రెండు విడతల్లో భాదితుని డబ్బును రెట్టింపు చేసి 20 వేల ఒకసారి,నలభై 40 వేల రూపాయలు ఒకసారి యాప్ అకౌంట్లో డిపాజిట్ చేసినారు.ఆ డబ్బును అతడు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. సైబర్ నేరగాళ్లను ను పూర్తిగా నమ్మిన బాధితుడు ఆ తరువాత 3 లక్షల 85 వేల రూపాయలను ఆ యాప్ లో పెట్టుబడి పెట్టడం జరిగింది.పెట్టుబడి పెట్టిన బాధితులు డబ్బులకు ఏడు లక్షల రూపాయలు వచ్చినట్లుగా,వాటిని విత్ డ్రా చేసుకోవడానికి మరో ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసి మొత్తం 16 లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చని నమ్మించారు.ఆ ఇన్వెస్ట్మెంట్ యాప్ లో సైబర్ నేరగాళ్లకు సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు తమకు అట్టి ఆప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అత్యధిక లాభాలు వస్తున్నట్లు కొన్ని ఫేక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్లను మెసేజ్ ల ద్వారా పోస్ట్ చేపిస్తూ బాధితుడిని నమ్మించారు.దీంతో బాధితుడు 16 లక్షలు రూపాయలు డబ్బులు వస్తాయనే అత్యాశతో,ఇంట్లో బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా,కొత్తగూడెం బ్రాంచ్లో తాకట్టు పెట్టి 05 లక్షల రూపాయలు సైబర్ నేరస్తులకు చెందిన రాజస్థాన్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి అదే బ్యాంక్ అధికారులను సంప్రదించగా,అంత పెద్ద మొత్తంలో డబ్బులు వేరే రాష్ట్రానికి చెందిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది,మేనేజర్ నరేందర్ కొత్తగూడెం జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సమాచారం అందించగా,బ్యాంకుకు చేరుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది బాధితున్ని విచారించి జరుగుతున్న మోసాన్ని వివరించి 05 లక్షల రూపాయల నగదు ట్రాన్స్ఫర్ ను అడ్డుకోవడం జరిగింది. అంతకుముందే బాధితుడు సైబర్ నేరగాళ్లకు పంపిన 3,85,000/-రూపాయల గురించి సైబర్ క్రైమ్ నమోదు చేసి పోయిన నగదును రిఫండ్ చేసే కార్యాచరణను సైబర్ సెక్యూరిటీ అధికారులు చేపట్టారు.సమయస్ఫూర్తితో వ్యవహరించి,తక్షణమే స్పందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగూడెం బ్రాంచ్ సిబ్బందిని,బ్రాంచ్ మేనేజర్ నరేందర్ ను కొత్తగూడెం జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పి బి.అశోక్,సిఐ ఎస్ జితేందర్ లు ప్రత్యక్షంగా అభినందించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్,వాట్సప్లో,ఇంటర్నెట్ సోషల్ మీడియా యాప్,బిజినెస్ ఇన్వెస్ట్మెంట్,స్టాక్ మార్కెట్,షేర్ మార్కెట్ కి సంబంధించిన మోసపూరిత ప్రకటనలను పంపిస్తూ సైబర్ బాధితులను రెట్టింపు లాభాన్ని పొందవచ్చని అత్యాశను కల్పిస్తూ నమ్మిస్తున్నారని,ఆ విధమైన మోసాలకు బలి కావద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ అశోక్ తెలిపారు.సైబర్ నేరాలలో ఎక్కువగా ఉద్యోగులు,వ్యాపారస్తులు లక్షలు,కోట్లలో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారని,సైబర్ నేరాలలో బాధితులు పోగొట్టుకుంటున్న నగదు 90 శాతం ఇలాంటి మోసాలలోనే కోల్పోతున్నారని కాబట్టి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ యాప్ లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని,బిజినెస్ నిపుణులను ప్రత్యక్షంగా కలుసుకొని సలహాలు తీసుకొని,ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీల గురించి విచారణ చేపట్టిన తర్వాత ముందుకు వెళ్లడం ద్వారా ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :