తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DMHO గా డాక్టర్ జయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు DMHO గా పనిచేసిన డాక్టర్ భాస్కర్ నాయక్ నేడు పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారుల సమక్షంలో ఆమె బాధ్యత స్వీకరించారు. అనంతరం ఆమెకు జిల్లా వైద్య సిబ్బంది తదితరులు కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ