తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో అధికారులకు కన్వేయన్స్ వాహనాలు పై పనిచేస్తున్న ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రైవేటు డ్రైవర్ల వేతనాలను పాత వాహనాలకు ప్రస్తుత వేతనాలపై 12%, నూతనంగా వచ్చిన హోండా సిటీ వాహనాల డ్రైవర్లకు నెలకు 18000/- చొప్పున వేతనాలు చెల్లించేట్లుగా ఒప్పందం కుదిరిందని దీనికి సహకరించిన ప్రైవేటు వాహన యజమానులకు, ఐక్యంగా నిలబడిన డ్రైవర్లకు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కేడబ్ల్యు క్రిస్టఫర్ లు అభినందనలు తెలిపారు. శుక్రవారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లోని ప్రాజెక్టు ప్లానింగ్ కార్యాలయం వద్ద జరిగిన వాహన యజమానులకు డ్రైవర్స్ యూనియన్ కు చర్చలలో ఒక అంగీకారానికి వచ్చి ఒప్పందం చేసుకొని అట్టి ఒప్పంద పత్రాలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రదర్శించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు యర్రగాని కృష్ణయ్య, కె డబ్ల్యూ కిస్టాఫర్ మరియు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి రాజేష్ లు మాట్లాడుతూ సింగరేణి కార్పొరేట్ పరిధిలో మొదటిసారిగా ఒక యూనియన్ ద్వారా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే సింగరేణిలో పెండింగ్ లో ఉన్న అడక్ పేమెంట్ డబ్బులు సమస్యను తక్షణమే పరిష్కరించాలని,ప్రతి నెల బిల్లులు పెండింగ్ లో లేకుండా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ ఒప్పందంలో ప్రతి సంవత్సరం దసరా నుండి దసరాకు 500/- చొప్పున పెంచాలని, డ్రైవర్ల అందరికీ సంవత్సరానికి ఒక జత యూనిఫామ్ బట్టలు ఇవ్వాలని, ప్రజల ప్రతినెల 7వ తేదీ నుండి పదవ తేదీలో గా వేతనాలు చెల్లించాలని, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఒప్పందం జరిగినట్టుగా నాయకులు తెలిపారు. ప్రభుత్వం జీవోలను సవరించినప్పుడు తిరిగి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమంలో వాహన యజమానులు అసోసియేషన్ తరపున పి రాజేష్, రాము, ప్రభాకర్ రెడ్డి, కే రామానుజము, కే శ్రీనివాస్, జి నగేష్, డి సునీల్, డ్రైవర్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జై మధు కుమార్, ఈ ప్రవీణ్ కుమార్ నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రామకృష్ణ, సతీష్,రహిమాన్, వంశీ,రామస్వామి, పూర్ణ, ముక్తార్, కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ