తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 15 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. సీనియర్స్ ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు అన్నవరపు జస్వంత్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సీనియర్స్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అన్ని శాఖల వారు ప్రశంసా పత్రాలు పొందితే ప్రజల సమస్యల కోసం నిరంతరం పాటుపడే ఏ ఒక్క జర్నలిస్టులకు ఒక్క ప్రశంసా పత్రం అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమా జర్నలిస్టుల ఆధిపత్య పోరు కారణమా అనేది ప్రతి ఒక్క జర్నలిస్టు ఆలోచించుకోవాల్సిన అంశంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చాపల మడుగు నరసింహారావు, గుండా సత్యనారాయణ, తంబర్ల పుల్లారావు,నల్లగట్ల దిలీప్ కుమార్ ,sk బుడెన్ పాషా,సంఘం నాగరాజు, ఉసికల రమేష్, బోరం రమేష్
Admin
తెలుగు వెలుగు టీవీ