తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హేమచంద్రపురం బైపాస్ రోడ్డులో ఉన్న గుట్టల్లో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్య దర్శి గౌని నాగేశ్వరరావు కోరారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అక్రమంగా మట్టి తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గుట్ట ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ