తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో పంచాయితీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకొని గ్రామపంచాయతీ అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా కోరారు. మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా మీ ఓటు హక్కును వినియోగించుకొండి. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఎవరైనా కోడును ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవి మరియు గ్రామంలోని రాజకీయ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ