Monday, 27 July 2026 01:00:20 AM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

10 వ వార్డులో ఇందిరమ్మ వార్డు సభ విజయవంతం

Date : 23 January 2025 07:59 PM Views : 861

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ 10 వ వార్డు అంబేద్కర్ చమన్ లో జరిగిన వార్డు సభ విజయవంతంగా ముగిసింది*ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి గారి సారధ్యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ అర్హులైన పేదలందరికీ న్యాయం చేసే దిశగా రైతు భరోసా, భూమిలేని కాయ కష్టం చేసేనిరుపేదలకు సంవత్సరానికి 12 వేలు, అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం, ఉగాది తర్వాత అర్హులైన వితంతు వృద్ధాప్య వికలాంగ పెన్షన్లు , ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని వెంట ఒకటి అమలు చేయటం జరుగుతుందని చెప్పారు. పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం అను నిత్యం శ్రమిస్తున్న స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని ఒప్పించి మంజూరు చేయించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రులు మల్లు బట్టి విక్రమ మార్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో ఓపికతో శ్రమకోర్చి ఇల్లులు తిరిగి లబ్ధిదారులను గుర్తించిన ఎంక్వయిరీ అధికారులను అభినందించారు. 10 వ వార్డులో 320 మందికి ఇందిరమ్మ ఇంటికి స్థలాలు లేనివారి అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 26 మందికి స్థలాలు ఉన్నవారి జాబితాలో అర్హులుగా గుర్తించారు , 59 మంది కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు, మరో 73 మంది కుటుంబ సభ్యులనురేషన్ కార్డుల్లో పేర్లు యాడింగ్ చేసి అర్హుల లిస్టులను గ్రామసభలో చదివి వినిపించి అర్హుల జాబితాను గ్రామసభ వద్ద గోడకు వార్డు ప్రజలకుసమాచారం నిమిత్తం అతికించడం జరిగింది. ఇంకా ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇండ్ల కోసం 95 దరఖాస్తులు మరియు రేషన్ కార్డుల కోసం 110 దరఖాస్తులను అధికారులు ప్రజల వద్ద నుండి స్వీకరించడం జరిగింది. ఈ వార్డు సభలో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ మరియు వార్డు ప్రత్యేక అధికారి రెవెన్యూ ఆర్ఐ సూర్యనారాయణ, వార్డు ఆఫీసర్ రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేడిపల్లి కవిత సబ్బని పాపారావు రామ్ రాకేష్ టు టౌన్ ఏ ఎస్ ఐ ఎస్తేరి మేరి, మరియు వార్డ్ ఆర్పి బానోత్ జానకి అంగన్వాడి టీచర్లు ఎన్ సరోజ, నీలవేణి ,శానాజ్ బేగం నాయకులు మునగడప వెంకటేశ్వర్లు, ఉప్పతల శ్రీను, గుంజా వెంకన్న, ఎస్కే జలీలు, ఖాన్ పెళ్లి దుర్గయ్య, ముద్దం మార్తమ్మ, మున్సిపల్ ,రెవిన్యూ అధికారులు సిబ్బంది వార్డు పెద్దలు, వార్డు ప్రజలు, మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :