Tuesday, 28 July 2026 08:50:12 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

చర్ల మండలంలో విస్తృత పర్యటన చేపట్టిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 10 December 2025 06:24 PM Views : 273

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చర్ల : ఆసుపత్రి సేవలు - ఎన్నికల ఏర్పాట్లు–మహిళా యూనిట్ల పనితీరును పరిశీలించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి బుధవారం చర్ల మండలంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు మరియు గ్రామీణ మహిళా ఉత్పాదక యూనిట్ల పనితీరుపై సమగ్ర సమీక్ష చేస్తూ పలు కీలక సూచనలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి వార్డు, ఎమర్జెన్సీ, గైనకాలజీ, పీడియాట్రిక్, లేబర్ రూమ్, ల్యాబ్, ఫార్మసీ, మొత్తం మౌలిక సదుపాయాలను సవివరంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, పరికరాల పనితీరు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది హాజరు, రికార్డు లు పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డ్ లో ఉన్న రోగులతో మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కొన్ని చోట్ల ఉన్న చిన్నచిన్న లీకేజీలు, మరమ్మత్తులు, గుర్తించిన కలెక్టర్ తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, అభివృద్ధి పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని వైద్య అధికారిని ఆదేశించారు. గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. తరువాత కలెక్టర్ చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ప్రతి కౌంటర్‌ను, పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్న సామాగ్రి పంపిణీ విధానాన్ని, చెక్‌లిస్ట్ ప్రకారం జరుగుతున్న ప్రక్రియలను సవివరంగా పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, సీల్‌లు, స్టాంపులు, ఫారమ్‌లు తదితర ఎన్నికల సామాగ్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది హాజరు, డబుల్-లాక్ సిస్టమ్‌ను పరిశీలించి ఎటువంటి భద్రతా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్, ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించడానికి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సహకారం తక్షణమే అందించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన త్రాగునీరు, విశ్రాంతి గదులు, భోజన సదుపాయాలను కూడా పరిశీలించి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందితో కలిసి భోజనం చేశారు. తరువాత కలెక్టర్ సుబ్బంపేట గ్రామంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులు, వికలాంగులకు ఏర్పాటు చేసిన ర్యాంపులు, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్ సదుపాయాలు, వెబ్‌కాస్టింగ్ కోసం అమర్చిన వీడియో కెమెరాల పనితీరును సమీక్షించారు. పోలింగ్ రోజున ఎటువంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు పూర్తి స్థాయిలో అమలులో ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఆర్.కొత్తగూడెంలోని శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్‌ను సందర్శించి మహిళలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డు, బర్ఫీ, చాక్లెట్, టీ పొడి, నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. ఇప్పపువ్వు సేకరణ విధానం, నాణ్యత, నిల్వ విధానాలు, మార్కెటింగ్ అవకాశాలపై సభ్యులతో చర్చించారు. ఇప్ప చెట్ల లెక్కింపు చేపట్టాలని సూచిస్తూ, పండ్లు నేలపై పడకుండా నెమ్మదిగా సేకరించేందుకు అవసరమైన నెట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పపువ్వు ఎండబెట్టేందుకు సోలార్ డ్రైయర్లు అవసరం ఉందని సభ్యులు కోరగా, వాటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ సాయి వర్ధన్, డాక్టర్ కాంత్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రావణి, చర్ల ఎంపీడీవో, శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లైబిలిటీ యూనిట్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :