తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఈఓ. ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు. ఐడిఓసి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈ వీసిలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్. డేటాను 2025 డేటాతో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్ర స్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.ఎస్.ఐ.ఆర్. 2002, ప్రస్తుత ఓటరు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లకు సంబంధించి ఎన్నికల కమీషన్ నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం రిపోర్టు తయారు చేయాలని, ఎస్.ఐ.ఆర్. సంబంధించి డెస్క్ వర్క్ సెప్టెంబర్ 24 నాటికి పూర్తి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్.ఐ.ఆర్. సంబంధించి డెస్క్ వర్క్ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, కొత్తగూడెం ఆర్టిఓ మధు, ఎలక్షన్ సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఏఈఆర్వోలు ధారా ప్రసాద్, పుల్లయ్య, తదితరులు మరియు ఎన్నికల నిర్వహణ సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ