Tuesday, 28 July 2026 12:08:21 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 06 May 2026 06:28 PM Views : 134

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వానాకాలం ఎరువులు, విత్తనాలు సన్నద్ధతపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం.ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల రైతుల వారోత్సవంలో భాగంగా విత్తనాలు, ఎరువుల డీలర్లకు అవగాహన, వానాకాలం సీజన్‌కు సంబంధించిన ఎరువుల సన్నద్ధతపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, సంబంధిత శాఖల అధికారులు, విత్తనాలు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6,59,743 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 1 లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 1.75 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు అవుతున్నాయని వివరించారు. గత సంవత్సరం జిల్లాలో అధిక దిగుబడులు సాధించామని, ఈ వానాకాలంలో కూడా అదే స్థాయిలో ఉత్పత్తి లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి డీలర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గుర్తింపు పొందిన సంస్థల నుంచే విత్తనాలు, ఎరువులను సేకరించి ప్రభుత్వ నిర్దేశించిన ధరలకు పారదర్శకంగా విక్రయాలు జరపాలని ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదన్నారు.ఎరువుల నిల్వలు, సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని పేర్కొంటూ జిల్లా మరియు మండల స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి యూరియా సహా ఇతర ఎరువుల నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ విత్తనాలు, ఎరువుల సరఫరా ఎంతో సున్నితమైన అంశమని, డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొరత రాకుండా చూడాలని సూచించారు. జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండటంతో పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుండి రైతులు ఇక్కడికి వచ్చి ఎరువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ ధరకు లభిస్తాయని భావించి నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితులు ఉండవచ్చని, అలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎక్కడైనా అనుమానాస్పదంగా విత్తనాలు లేదా ఎరువుల విక్రయాలు జరుగుతున్నట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. గత సంవత్సరంలో జిల్లాలో ఐదు నకిలీ విత్తనాల కేసులు నమోదయ్యాయని, ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఎరువుల వినియోగం, నిల్వ, నాణ్యత ప్రమాణాలు, స్టాక్ నిర్వహణ, ఆన్‌లైన్ నమోదు విధానాలపై డీలర్లకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు ఎరువుల డీలర్లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :